ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షిస్తోన్న 'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్

  • పెళ్లంటే జీవితంలో ఒక్కసారే వచ్చే పండుగ
  • ప్రేమంటే ఒకరినొకరు ఆనందంగా ఉంచడమే 
  • ఈ రెండింటి కలయికే 'శ్రీనివాస కళ్యాణం'    
నితిన్ .. రాశి ఖన్నా జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. జీవితంలో ఒక్కసారే వచ్చే పండుగే పెళ్లి అంటూ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

 ప్రేమ కబుర్లు .. పెళ్లి సందడికి సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా .. ఫ్యామిలీ ఆడియన్స్ మనసును పట్టుకునేలా వుంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రతి ఫ్రేమ్ నిండుగా .. కలర్ ఫుల్ గా కనిపించేలా చూసుకుంటూ, దర్శకుడు కృష్ణవంశీ టేకింగ్ ను గుర్తుచేశాడు. ఇక బాలు పాడిన టైటిల్ సాంగ్ ఈ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. 
Go Back to Shorts
nithin
rasi khanna

More Telugu News